అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | The person killed in a suspicious state | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Aug 7 2016 6:15 PM | Updated on Sep 4 2018 5:21 PM

అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది.

అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి కి చెందిన ఎస్.రాజు (30) సివిల్ వర్క్‌లు చేస్తు జీవనం సాగిస్తున్నాడు.

రెండు నెలల క్రితం తండ్రి నర్సింహ చనిపోయినప్పటికి నుంచి తాగుడుకు బానిసై పని చేయకుండానే ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పధ మృతిగా కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement