వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Jun 13 2016 10:51 AM | Updated on Sep 4 2017 2:23 AM

ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం వేకువజామున విషాదం చోటుచేసుకుంది.

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం వేకువజామున విషాదం చోటుచేసుకుంది. బండి వెలిగండ్ల గ్రామానికి చెందిన స్వప్న(19) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించింది. స్వప్నను అత్తింటి వారే చంపి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని యువతి తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. స్వప్న భర్త ఏసుదాసును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న, ఏసుదాసులకు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement