ట్రాక్టర్ సహా బావిలో పడి రైతు | the farmer has fallen well Including the tractor, | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ సహా బావిలో పడి రైతు

Aug 2 2016 3:08 PM | Updated on Apr 3 2019 7:53 PM

పొలం దున్నుతూ ట్రాక్టర్‌తోపాటు ఓ రైతు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు.

 పొలం దున్నుతూ ట్రాక్టర్‌తోపాటు ఓ రైతు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు, రైతు బోయిని రామయ్య మంగళవారం ఉదయం పొలం దున్నేందుకు వెళ్లాడు. అయితే, ఆక్రమంలో ప్రమాదవశాత్తు పొలంలోనే ఉన్న బావిలో ట్రాక్టర్‌తోపాటు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement