ఆ డీల్ ఖరీదు వందకోట్లు... | The cost of one hundred million deal | Sakshi
Sakshi News home page

ఆ డీల్ ఖరీదు వందకోట్లు...

Oct 18 2015 2:27 PM | Updated on Sep 17 2018 5:32 PM

ఆ డీల్ ఖరీదు వందకోట్లు... - Sakshi

ఆ డీల్ ఖరీదు వందకోట్లు...

విజయవాడలోని తెలుగు తమ్ముళ్లలో ప్రస్తుతం ఇదో పెద్ద చర్చ. విజయవాడకు చెందిన ఒకరు హఠాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు

విజయవాడలోని తెలుగు తమ్ముళ్లలో ప్రస్తుతం ఇదో పెద్ద చర్చ. విజయవాడకు చెందిన ఒకరు హఠాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ వెంటనే ఎంపీగా పోటీచేసి రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఛాంపియన్ అంటూ గొంతెత్తారు. ఆ తరువాత రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్న మజా ఏమిటో రుచి చూసిన ఆయన గతంలో తాను ప్రాతినిధ్యం విహ ంచిన పార్టీలో కొనసాగితే రాజకీయంగా భవిష్యత్ లేదని నిర్ధారించుకున్నారు. ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆయన ప్రతిదీ లాభానష్టాలతో బేరీజు వేస్తుంటారు.

రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి మరో పార్టీలో చేరితే లాభం, నష్టం ఎంతో ఒక అంచనాకు ఆయన వచ్చారు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో చేరితే రానున్న మూడున్నర సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు లబ్ధి పొందవచ్చని భావించిన ఆయన పెద్ద మొత్తంలో సమర్పించుకోవాలని నిర్ణయించారట. త్వరలో అధికార పార్టీలో చేరేందుకు అనువుగా ఇప్పటికే అధినేతతో సంప్రదింపులు జరిపిన ఆయన సుమారు రూ. వందకోట్లు సమర్పించేందుకు సిద్ధపడ్డారట. అంత పెద్ద మొత్తం సమర్పించినందుకు వచ్చే ఎన్నికల వరకూ పార్టీలో చేరిన నేత అడిగిన పనల్లా చేసి పెట్టడంతో పాటు  విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ సీటు కూడా ఇస్తానని అధినేత హామీ ఇచ్చారట. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు ఆ డీల్ చాలా పెద్దదట అని చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement