మామిడి తోటలో బాలుడి మృతదేహం | The boy's body ÔFound in the Mango garden | Sakshi
Sakshi News home page

మామిడి తోటలో బాలుడి మృతదేహం

Jan 17 2017 10:42 PM | Updated on Sep 5 2017 1:26 AM

మామిడి తోటలో బాలుడి మృతదేహం

మామిడి తోటలో బాలుడి మృతదేహం

అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని గొంతునులిమి హత్య చేసిన ఉదంతం చిట్వేలి మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

చిట్వేలి: అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని గొంతునులిమి హత్య చేసిన ఉదంతం చిట్వేలి మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.  సిద్దారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అంకాలమ్మ ఎస్టీ కాలనీకి చెందిన జలకం వీరమ్మకు ఐదేళ్ల క్రితం సుబ్బరాయుడు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి శివ అనే నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో శివమ్మకు ఎందోటి పెంచలయ్య అనే వ్యక్తితో పరిచయమైంది. వీరిద్దరూ పది రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఈనెల 15న ఆదివారం శివను వెంట తీసుకుని సీఎం రాచపల్లి ఎగువ ఎస్టీ కాలనీలో ఉన్న బంధువు నగరిపాటి మణి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి సోమవారం బాలుడి తో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే వీరిద్దరు గ్రామానికి చేరుకోగా బాలుడు మాత్రం రాలేదు. సీఎంరాచపల్లికి చెందిన ఓ మామిడితోటలో బాలుడి మృతదేహం ఉన్నట్లు  గ్రామసేవకుడు చంద్రయ్య మంగళవారం వీఆర్వో మోహన్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు వీఆర్వో మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు ఇన్‌చార్జి సీఐ అశోక్‌కుమార్, చిట్వేలి ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తమకు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో  బాలుడిని గొంతు నులిమి హత్యచేసినట్లు స్పష్టమవుతోంది.  ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement