ఈఓకు నోటీసు ఇస్తున్న ఆలయ అర్చకులు
అలంపూర్ : ఓ పోలీస్ అధికారి తీరుపై అలంపూర్ ఆలయ అర్చకులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అర్చకులు, సిబ్బందని చూడకుండా దురుసుగా వ్యవహరించారని ఆలయ ఈఓ గురురాజకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఆలయాలను తెరకుండా విధులను బహిష్కరిస్తామని గురువారం రాత్రి ఈఓకు నోటీసు ఇచ్చారు.
పోలీస్ అధికారి తీరుపై ఆలయ అర్చకులు, ఉద్యోగుల నిరసన
అలంపూర్ : ఓ పోలీస్ అధికారి తీరుపై అలంపూర్ ఆలయ అర్చకులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అర్చకులు, సిబ్బందని చూడకుండా దురుసుగా వ్యవహరించారని ఆలయ ఈఓ గురురాజకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఆలయాలను తెరకుండా విధులను బహిష్కరిస్తామని గురువారం రాత్రి ఈఓకు నోటీసు ఇచ్చారు. జోగుళాంబ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఆలయ అర్చకులు, ఉద్యోగులను చివరకు ఈఓను సైతం లోపలికి రాకుండా అడ్డుకున్నట్లు వారు పేర్కొన్నారు. అక్కడున్న మీడియా వారు ఆలయ అధికారులు, అర్చకులని చెబుతున్నా పట్టించుకోకుండా దుర్బాషగా మాట్లాడినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. జరిగిన అవమానానికి నిరసనగా ఆలయాలను తెరకుండా విధులు బహిష్కరించాలని తీర్మాణించినట్లు తెలిపారు.