పెరిగిన ఉష్ణోగ్రతలు | temperature details | Sakshi
Sakshi News home page

పెరిగిన ఉష్ణోగ్రతలు

Feb 15 2017 10:58 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లాలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట చలి అధికంగా ఉంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో   పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట చలి అధికంగా ఉంది. మరోవైపు ఎండలు కాస్తున్నాయి. బుధవారం అగళిలో 13.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత, ఎన్‌పీ కుంటలో 37 డిగ్రీల గరిష్టం నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 20 డిగ్రీలు కనిష్టం, 32 నుంచి 36 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగాయి. గాలిలో తేమ శాతం ఉదయం 67 నుంచి 87, మధ్యాహ్నం 25 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గంటకు 7 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement