పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు | temperature details | Sakshi
Sakshi News home page

పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

Feb 1 2017 10:50 PM | Updated on Mar 28 2019 6:27 PM

రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఎండలకు చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. బుధవారం అగళిలో 11.4 డిగ్రీల కనిష్టం నమోదు కాగా, తనకల్లు 11.7 డిగ్రీలు, రొద్దం 13.3 డిగ్రీలు, కనగానపల్లి 13.4 డిగ్రీలు, నల్లమాడ 13.6 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 36 డిగ్రీల వరకు నమోదు కావడంతో ఎండలు కాస్త పెరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement