‘దేశం’ నాయకుల వాగ్వాదం | tdp leaders altercation | Sakshi
Sakshi News home page

‘దేశం’ నాయకుల వాగ్వాదం

Aug 27 2016 11:22 PM | Updated on Aug 10 2018 8:16 PM

‘దేశం’ నాయకుల వాగ్వాదం - Sakshi

‘దేశం’ నాయకుల వాగ్వాదం

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదం చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సుండుపల్లికి చెందిన ఓ నాయకుడు స్థానిక బహుదా నది నుంచి కొందరు ఇసుకను తరలిస్తున్నారనే కారణంగా వాహనాలు రాకుండా చేసేందుకు రోడ్డుకు మధ్యలో గుంతలు తీశారు.

సుండుపల్లి:

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదం చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సుండుపల్లికి చెందిన ఓ నాయకుడు స్థానిక బహుదా నది నుంచి కొందరు ఇసుకను తరలిస్తున్నారనే కారణంగా వాహనాలు రాకుండా చేసేందుకు రోడ్డుకు మధ్యలో గుంతలు తీశారు. అయితే ఇదే ప్రాంతంలో కాంట్రాక్టు పనులు చేస్తున్న మరో టీడీపీ నాయకుడు తన పనులకు ఇసుక తీసుకెళ్లకూడదే ఉద్దేశంతోనే రోడ్డుకు అడ్డంగా గుంతలు తీశారంటూ విషయాన్ని ఎమ్మెల్యే మేడా దృష్టికి తీసుకెళ్లారు. శనివారం బూడిదగుంటరాచపల్లి సమీపంలో పంటలు పరిశీలించేందుకు వచ్చిన మేడా ఈ విషయమై ఇద్దరు నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే తన వాహనం ఎక్కి తిరుపతికి వెళ్లిపోయారు. నాయకులు కూడా ఎవరిదారిన వారు వెళ్లారు. టీడీపీ నాయకుల వాగ్వాదం విషయం సుండుపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement