అమరావతి పేరుతో దోపిడీ | tdp goverment robery | Sakshi
Sakshi News home page

అమరావతి పేరుతో దోపిడీ

Sep 19 2016 8:35 PM | Updated on Jul 11 2019 8:34 PM

అమరావతి పేరుతో దోపిడీ - Sakshi

అమరావతి పేరుతో దోపిడీ

అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ధ్వజమెత్తారు. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీ సాధించిన సీఎం చంద్రబాబు కమీషన్లు దండుకునేందుకు కల్లబొల్లి మాటలు వల్లిస్తున్నారన్నారు.

  • ప్యాకేజీలతో పొందేది పర్సంటేజీలు
  • కాంగ్రెస్‌ చైతన్యయాత్రలో పళ్లంరాజు
  • తుని :
    అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు,  కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ధ్వజమెత్తారు. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీ సాధించిన సీఎం చంద్రబాబు కమీషన్లు దండుకునేందుకు కల్లబొల్లి మాటలు వల్లిస్తున్నారన్నారు. తుని లో  కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ సీహెచ్‌. పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ చైతన్య యాత్ర సమావేశంలో పళ్లంరాజు బీజేపీ, టీడీపీల పై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు కాకుండా రాష్ట్రానికి అదనంగా ఏమి తెచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలను గాలికొదిలేశారని, సంక్షేమ ప«థకాలను జన్మభూమి కమిటీలకు అప్పగించి అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి జేడీ శీలం మాట్లాడుతూ  గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించేందుకు భయపడుతున్నారన్నారు. ప్యాకేజీని హోదాతో ముడిపెట్టడం సరికాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పార్టీని  గ్రామ స్థాయిలో పటిష్టం చేసేందుకు రూపొందించిన కాంగ్రెస్‌ చైతన్య యాత్రను తూర్పు సెంటిమెంటుతో తుని నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుందుల దుర్గేష్, పరిశీలకుడు పక్కాల సూరిబాబు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement