కాపు నేత ముద్రగడకు మద్దతుగా టీడీపీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో 106 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం రాజీనామాలతో టీడీపీకి షాకిచ్చారు.
యలమంచిలి (పశ్చిమ గోదావరి) : కాపు నేత ముద్రగడకు మద్దతుగా టీడీపీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో 106 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం రాజీనామాలతో టీడీపీకి షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు 106 మంది సంతకాలతో కూడిన లేఖను పార్టీ గ్రామ అధ్యక్షుడు గుబ్బల ఏడుకొండలుకు అందజేశారు. రాజీనామా చేసినవారిలో లింగం లక్ష్మి, వినుకొండ వెంకటేశ్వరరావు, రామలక్ష్మి, కాశీ విశ్వనాథం తదితరులు ఉన్నారు.