టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | tdp activists joined ysrcp in kirikera | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Sep 17 2016 12:21 AM | Updated on Aug 10 2018 8:35 PM

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక - Sakshi

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

మండలంలోని కిరికెర గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

హిందూపురం రూరల్‌ : మండలంలోని కిరికెర గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అధికార పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు, నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కిరికెర గ్రామస్తులు నారాయణప్ప, ప్రభాకర్, చిన్నప్పయ్య, కొండప్ప, బాబన్న, కిష్టప్ప, చిన్న యల్లప్ప, హనుమయ్య, నారాయణస్వామి, గోవి, బాలు, చిన్న నారాయణప్ప, మరో 8 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.

పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల కోసం పని చేస్తున్నారని వారికి మద్దతుగా నిలిచి పార్టీ అభివద్ధికి కషి చేయాలని నవీన్‌నిశ్చల్‌ పిలుపునిచ్చారు. మండల కన్వీనర్‌ బసిరెడ్డి, కిరికెర మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, చాంద్‌బాషా, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్‌ రాము, కొటిపి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement