breaking news
kirikera
-
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
హిందూపురం రూరల్ : మండలంలోని కిరికెర గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అధికార పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు, నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కిరికెర గ్రామస్తులు నారాయణప్ప, ప్రభాకర్, చిన్నప్పయ్య, కొండప్ప, బాబన్న, కిష్టప్ప, చిన్న యల్లప్ప, హనుమయ్య, నారాయణస్వామి, గోవి, బాలు, చిన్న నారాయణప్ప, మరో 8 మంది వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజా పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల కోసం పని చేస్తున్నారని వారికి మద్దతుగా నిలిచి పార్టీ అభివద్ధికి కషి చేయాలని నవీన్‌నిశ్చల్ పిలుపునిచ్చారు. మండల కన్వీనర్ బసిరెడ్డి, కిరికెర మాజీ సర్పంచ్ సత్యనారాయణ, చాంద్‌బాషా, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము, కొటిపి మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గంజి ఉత్సవం
హిందూపురం రూరల్ / అర్బన్: హిందూపురం రూరల్ మండలంలోని కిరికెర గ్రామంలో వెలసిన ఓమ్‌శక్తి అమ్మవారి గంజి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణమాసం మొదటి ఆదివారం అయ్యప్ప ఆలయంలో రాగి గంజి కాచి వేప ఆకులతో అలంకరించి ఓమ్‌శక్తి అమ్మవారిని పల్లకీలో గ్రామ పుర వీధులగుండా ఊరేగింపుగా తీసుకువస్తారు. అనంతరం ఓమ్‌శక్తి ఆలయంలో రాగి గంజిని భక్తులకు నైవేద్యంగా పంపిణీ చేస్తారని వారు తెలిపారు. ఆలయ పూజారులు అమ్మవారికి ఉదయం విశేష అలంకరణలతో కుంకుమార్చన, అభిషేకార్చన నిర్వహించారు. గంజి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎర్రని వస్త్రాలు ధరించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.