ఘనంగా గంజి ఉత్సవం | ganji uthsavanm in kirikera | Sakshi
Sakshi News home page

ఘనంగా గంజి ఉత్సవం

Aug 7 2016 10:32 PM | Updated on Sep 4 2017 8:17 AM

ఘనంగా గంజి ఉత్సవం

ఘనంగా గంజి ఉత్సవం

హిందూపురం రూరల్‌ మండలంలోని కిరికెర గ్రామంలో వెలసిన ఓమ్‌శక్తి అమ్మవారి గంజి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

హిందూపురం రూరల్‌ / అర్బన్‌: హిందూపురం రూరల్‌ మండలంలోని కిరికెర గ్రామంలో వెలసిన ఓమ్‌శక్తి అమ్మవారి గంజి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణమాసం మొదటి ఆదివారం అయ్యప్ప ఆలయంలో రాగి గంజి కాచి వేప ఆకులతో అలంకరించి ఓమ్‌శక్తి అమ్మవారిని పల్లకీలో గ్రామ పుర వీధులగుండా ఊరేగింపుగా తీసుకువస్తారు.

అనంతరం ఓమ్‌శక్తి ఆలయంలో రాగి గంజిని భక్తులకు నైవేద్యంగా పంపిణీ చేస్తారని వారు తెలిపారు. ఆలయ పూజారులు అమ్మవారికి ఉదయం విశేష అలంకరణలతో కుంకుమార్చన, అభిషేకార్చన నిర్వహించారు. గంజి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎర్రని వస్త్రాలు ధరించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement