‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి.. తొలి సినిమాతోనే భారీ హిట్ కావడంతో తనపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎల్లమ్మ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ అదిరిపోయిందని నెటిజన్లు రివ్యూలు కూడా ఇచ్చేశారు. మూవీ షూటింగ్ పనుల్లో ఉన్న వేణుపై సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.

తాజాగా వేణు తన షోషల్‌మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. తెలంగాణలోని ఓ ఆలయ ప్రాంగణంలో ఆయన ఫోటోలు దిగాడు. ఆ సమయంలో తను షూ ధరించే ఉండటంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో వేణుపై విరుచుకుపడుతున్నారు. షూ ధరించి గుడిపైకి మంచిగానే వెళ్లినవ్ అంటూనే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే, మరికొందరు వేణుకు మద్ధతుగా నిలుస్తున్నారు. తను కూర్చొని ఉన్నది ప్రధాన ఆలయం కాదని చెబుతున్నారు. ఆపై సినిమా షూటింగ్ కాబట్టి ఎక్కువగా విద్యుత్ వైర్లు ఉంటాయని అందుకే తను అలా షూ ధరించాడని తెలుపుతున్నారు. అయితే, ఈ వివాదం గురించి వేణు స్పందించలేదు. షూటింగ్‌లో భాగంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు.


