సంక్రాంతి కల్లా ఇంటింటికీ నల్లా నీరు | tap water for every house | Sakshi
Sakshi News home page

సంక్రాంతి కల్లా ఇంటింటికీ నల్లా నీరు

Jul 20 2016 9:55 PM | Updated on Jul 6 2018 3:32 PM

వచ్చే సంక్రాంతి నాటికల్లా ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి అన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌ : వచ్చే సంక్రాంతి నాటికల్లా ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి అన్నారు. బుధవారం నర్సాపూర్‌ 19వ వార్డులోకి వచ్చే తుక్కారాం గిరిజన తండాలో రక్షిత మంచినీటి ట్యాంక్‌ను ప్రారంభించి, గిరిజనుల ఇండ్ల వద్ద నల్లాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పూర్తయితే తాగునీటి సమస్య ఉండదన్నారు. తండా సమీపంలో నూతనంగా నిర్మించిన ట్యాంక్‌ వద్ద ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బోగశేఖర్, నర్సాపూర్‌ సర్పంచ్‌ రమణారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement