సాంఘిక బహిష్కరణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి | take action on exclusion incidents | Sakshi
Sakshi News home page

సాంఘిక బహిష్కరణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

Aug 4 2016 11:06 PM | Updated on Oct 22 2018 7:26 PM

సాంఘిక బహిష్కరణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి - Sakshi

సాంఘిక బహిష్కరణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

మోర్తాడ్‌ మండలం ధర్మారంలో గౌడ కుటుంబాల సాంఘిక బహిష్కరణకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డి గౌడ సంఘం సభ్యులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఎల్లారెడ్డి : మోర్తాడ్‌ మండలం ధర్మారంలో గౌడ కుటుంబాల సాంఘిక బహిష్కరణకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డి గౌడ సంఘం సభ్యులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గౌడ సంఘం మండలాధ్యక్షుడు సాయాగౌడ్‌ నేతృత్వంలో వారు కార్యాలయ సూపరింటెండెంట్‌ బాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ధర్మారం గ్రామంలో 12 మంది గీత కార్మిక కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించి వారికి వైద్యం కూడా అందనివ్వడం లేదని, వారి పిల్లలను పాఠశాలల్లోకి రానివ్వడం లేదని ఇది అమానుష చర్య అని సంఘం అధ్యక్షుడు అన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి బా«ధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పామయ్యగారి ఈశ్వర్‌గౌడ్, వినోద్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement