బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్‌ | swachabharath in basara iiit | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్‌

Aug 12 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:00 AM

కేంద్రప్రభుత్వం, ఎన్‌ఎస్‌ఎస్‌ పిలుపు మేరకు శుక్రవారం బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సత్యనారాయణ విద్యార్థులతో స్వచ్ఛభారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు.

బాసర : కేంద్రప్రభుత్వం, ఎన్‌ఎస్‌ఎస్‌ పిలుపు మేరకు శుక్రవారం బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సత్యనారాయణ విద్యార్థులతో స్వచ్ఛభారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, స్వచ్ఛభారత్‌ సాధన దిశగా కషిచేయాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ బి.శ్యాంబాబు, ఆఫీసర్‌ విజయ్‌కుమార్, అనిత, నరేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement