సుమో బోల్తా : ఇద్దరి మృతి | sumo fallen in ysr district two died | Sakshi
Sakshi News home page

సుమో బోల్తా : ఇద్దరి మృతి

Feb 7 2016 7:21 PM | Updated on Aug 25 2018 6:06 PM

వైఎస్సార్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

కలసపాడు : వైఎస్సార్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.  కలసపాడు మండలం పిడుగుపల్లి సమీపంలో ఓ సుమో ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

ఈ ఘటనలో శశికుమార్(17), పద్మజ(16) అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement