చెస్‌ టోర్నీ విజేత సుభాని | subhani winner of chess tournament | Sakshi
Sakshi News home page

చెస్‌ టోర్నీ విజేత సుభాని

Nov 14 2016 12:22 AM | Updated on Sep 4 2017 8:01 PM

అస్రాఫ్‌ సుభానీకి బహుమతి అందజేస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో యుగంధర్‌

అస్రాఫ్‌ సుభానీకి బహుమతి అందజేస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో యుగంధర్‌

ధర్మవరంలోని ఉషోదయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో వైఎస్సార్‌ జిల్లా వాసి అస్రాఫ్‌ సుభాని విజేతగా నిలిచాడు.

ధర్మవరం టౌన్ :
స్థానిక ఉషోదయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో వైఎస్సార్‌ జిల్లా వాసి అస్రాఫ్‌ సుభాని విజేతగా నిలిచాడు. శశిధర్‌ కార్తీక్‌ (వైజాగ్‌), ప్రసాద్‌ (ప్రకాశం) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కింగ్‌ చెస్‌ అకాడమి ఆధ్వర్యంలో యువర్స్‌ ఫౌండేష¯న్ సహకారంతో నిర్వహించిన ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 162 మంది పాల్గొన్నారు.
 
వారిలో ఉత్తమ పాయింట్లు సాధించిన 25 మందిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉషోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతి«థిగా డిప్యూటి డీఎంహెచ్‌వో యుగంధర్, ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ మాధవరావు, యువర్స్‌ పౌండేషన్ సభ్యులు చాంధ్‌బాషా, పోలా ప్రభాకర్‌ హాజరయ్యారు.
 
సుభాని, కార్తీక్, ప్రసాద్‌లతోపాటు మరో 23 మందికి డిప్యూటి డీఎంహెచ్‌వో యుగంధర్, ఎస్‌బీఐ మేనేజర్‌ మాధవరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం క్రీడతో మానవుని మేధస్సును పెంచుకునే వీలుందన్నారు. ఈ క్రీడను అభివృద్ధి చేయడంలో ధర్మవరం వాసులు మంచి కృషి చేస్తున్నారని అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతియేటా నవంబర్‌ నెలలో రేటింగ్‌ చెస్‌ టోర్నీ నిర్వహిస్తామన్నారు.
 
ఈ కార్యక్రమంలో కింగ్‌ చెస్‌ అకాడమి నిర్వాహకుడు జాకీర్, ఎస్‌బీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ బీవీ ప్రకాష్, సీనియర్‌ చెస్‌ క్రీడాకారుడు అశ్వర్థనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement