విద్యార్థులు క్రీడల్లో రాణించాలి | students must participate in sports | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Oct 28 2016 9:50 PM | Updated on Sep 4 2017 6:35 PM

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. మండలంలోని నరసాపురంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్న జోనల్‌ పోటీలు ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు.

నరసాపురం(విస్సన్నపేట): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. మండలంలోని నరసాపురంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్న జోనల్‌ పోటీలు ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో మూడు జిల్లాల స్థాయిలో జోనల్‌ పోటీలు నిర్వహించటం దానికి గ్రామస్తులు సహాయ సహకారం అందించటం అభినందనీయం అన్నారు. కబడ్డీ ఫైనల్‌ పోటీలను ఎమ్మేSల్యే రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు.
ఓవరాల్‌ చాంపియన్‌ కొవ్వూరు
–కళాశాల ఓవరాల్‌ చాంపియన్‌గా కొవ్వూరు గురుకుల కళాశాల విద్యార్థులు నిలిచారు. స్పోర్ట్స్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా కొవ్వూరు విద్యార్థిని యు.సింధూ నిలిచింది. పాఠశాల స్థాయి ఓవరాల్‌ చాంపియన్‌గా వట్లూరు నిలవగా, స్పోర్ట్స్‌ చాంపియన్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన కె.కళ్యాణి నిలిచింది. విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీటీసీ మట్టా ధనలక్ష్మి, ఎంపీడీవో జి.రాణి, సీఐ కిషోర్‌బాబు, ఎస్‌ఐ చిరంజీవి, గ్రామ ప్రముఖులు గొటేటి సుబ్రమణ్నేశ్వరరావు(బుడ్డియ్య), వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతల భాస్కరరెడ్డి, గ్రామస్తులు కాసర చెన్నారెడ్డి, చింతల ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement