breaking news
MLA Rakshananidhi
-
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు
ఎ.కొండూరు: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని, అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి చెప్పారు. ఎ.కొండూరులో అయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తన పై నమ్మకం పెట్టుకుని గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. 2019లో తిరువూరు నియోజకవర్గం నుంచే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుకుగా పాల్గొని సైనికుల్లా పనిచేస్తున్నారని, ప్రజలకు అండగా ఉండి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. టీడీపీలోకి తనను ఆహ్వానించిన నాయకులు ఎవ్వరూ లేరని ఎవరైనా ఉంటే బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ననకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని, రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు నరెడ్ల వీరారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పాలం ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షులు భూక్య గనియా, టి.వెంకటేశ్వరరెడ్డి, కంభంపాడు సర్పంచ్ కోట పుల్లారావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
నరసాపురం(విస్సన్నపేట): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. మండలంలోని నరసాపురంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్న జోనల్ పోటీలు ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో మూడు జిల్లాల స్థాయిలో జోనల్ పోటీలు నిర్వహించటం దానికి గ్రామస్తులు సహాయ సహకారం అందించటం అభినందనీయం అన్నారు. కబడ్డీ ఫైనల్ పోటీలను ఎమ్మేSల్యే రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. ఓవరాల్ చాంపియన్ కొవ్వూరు –కళాశాల ఓవరాల్ చాంపియన్‌గా కొవ్వూరు గురుకుల కళాశాల విద్యార్థులు నిలిచారు. స్పోర్ట్స్ ఓవరాల్ చాంపియన్‌గా కొవ్వూరు విద్యార్థిని యు.సింధూ నిలిచింది. పాఠశాల స్థాయి ఓవరాల్ చాంపియన్‌గా వట్లూరు నిలవగా, స్పోర్ట్స్ చాంపియన్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన కె.కళ్యాణి నిలిచింది. విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీటీసీ మట్టా ధనలక్ష్మి, ఎంపీడీవో జి.రాణి, సీఐ కిషోర్‌బాబు, ఎస్ఐ చిరంజీవి, గ్రామ ప్రముఖులు గొటేటి సుబ్రమణ్నేశ్వరరావు(బుడ్డియ్య), వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతల భాస్కరరెడ్డి, గ్రామస్తులు కాసర చెన్నారెడ్డి, చింతల ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.