ర్యాగింగ్‌తో విద్యార్థిని ఆత్మహత్య? | Students commits Suicide | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌తో విద్యార్థిని ఆత్మహత్య?

Jul 14 2015 5:18 PM | Updated on Nov 9 2018 5:02 PM

ర్యాగింగ్‌తో విద్యార్థిని ఆత్మహత్య? - Sakshi

ర్యాగింగ్‌తో విద్యార్థిని ఆత్మహత్య?

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

నాగార్జున వర్సిటీ (గుంటూరు) : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన మొండి రుషికేశ్వరి(18) ఆర్కిటెక్చర్ ఫస్టియర్ చదువుతోంది. క్యాంపస్లోని ఇందిరా ప్రియదర్శిని హాస్టల్‌లో ఆమె మరో ఇద్దరు విద్యార్థినులతో కలసి ఉంటోంది. కాగా మంగళవారం కళాశాలకు వెళ్లకుండా రూంలోనే ఉండిపోయిన రుషికేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.

మధ్యాహ్నం స్నేహితులు తిరిగి వచ్చి చూడగా ఆమె విగతజీవిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కొన్ని రోజులుగా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట పెట్టిన వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఆమె వద్ద లభించిన సూసైట్ నోట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement