విద్యార్థిని ఆత్మహత్య | student suicides | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Apr 14 2017 11:48 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అనంతపురం సెంట్రల్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలో కళ్యాణదుర్గం రోడ్డుకు సమీపంలోని పాపంపేటలో నివాసమున్న పద్మక్క కుమార్తె రాజేశ్వరి నగరంలో ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గురువారం విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్‌ అయింది. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున కుటుంబసభ్యులు గమనించారు. కాగా టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement