అంతర్జాతీయ ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక | Student selected for international competitions khokho | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక

Sep 4 2016 12:12 AM | Updated on Nov 9 2018 5:02 PM

అంతర్జాతీయ ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక - Sakshi

అంతర్జాతీయ ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక

నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమార్‌ ఖోఖో పోటీల్లో సత్తా చాటుతున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం లో నిలిచిన సాయికుమార్‌ అంతర్జాతీయ స్థా యి పోటీలకు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చు లు సైతం వెచ్చించలేని పరిస్థితి. జఫర్‌గఢ్‌ మం డలం తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన కొంతం సాయికుమార్‌ ఈనెల 8న నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు.

  • నేపాల్‌లో ఈనెల 8 నుంచి క్రీడలు 
  • రవాణా ఖర్చులు భరించలేని సాయికుమార్‌ 
  • ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
  • జఫర్‌గఢ్‌ : నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమార్‌ ఖోఖో పోటీల్లో సత్తా చాటుతున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం లో నిలిచిన సాయికుమార్‌ అంతర్జాతీయ స్థా యి పోటీలకు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చు లు సైతం వెచ్చించలేని పరిస్థితి. జఫర్‌గఢ్‌ మం డలం తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన కొంతం సాయికుమార్‌ ఈనెల 8న నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు.
     
    ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అండర్‌ 17 జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని  స్వర్ణపతకం సాధించాడు. ప్రస్తుతం సాయికుమార్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఆదిత్య ఐటీఐ కళాశాలలో సెకండియర్‌ చదువుతున్నా డు. ఖోఖోపై మక్కువతో మండల, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాడు. కాజీపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీ లు, నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సాయికుమార్‌ స్వర్ణ పతకం సాధించాడు. అలాగే, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీ య స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపి నేపాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాయికుమార్‌ను కళాశాల యాజమాన్యం, సహచర విద్యార్థులు  అభినందించారు.   కాగా నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమా ర్‌.. నేపాల్‌కు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బం దులు పడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలంటే కనీసం రూ. 25 వేలు ఖర్చవుతాయి. ఎవరైనా దాతలు, క్రీడాభిమానులు మందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలని సాయికుమార్‌ కోరుతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement