ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు.. | stop the roomers | Sakshi
Sakshi News home page

ఉనికిని కాపాడుకునేందుకే ఆరోపణలు..

Jul 27 2016 12:11 AM | Updated on Sep 4 2017 6:24 AM

నాగర్‌కర్నూల్‌రూరల్‌: ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌రూరల్‌: ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కొడంగల్, గద్వాల ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, డీకే అరుణ పాల మూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, కేఎల్‌ఐ ప్రాజెక్టు పనులు సక్రమంగా జరుగుతున్నా వారి ఉనికిని కోల్పోతున్నారన్న భయంతో ఆరోపణలు చేస్తున్నారని, అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తే జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. భవిష్యత్‌లో వారికి ప్రజల నుంచి మరింత విశ్వాçÜం పోతుందనే భయం పట్టుకుందన్నారు. ప్రాజెక్టులు అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హరితహారంలో భాగంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, నిత్యం నాటిన మొక్కలను ఎమ్మెల్యే దృష్టికి తేవాలని విజ్ఞప్తి చేశారు.  వర్షాలు ఎప్పుడు పడ్డా గ్రామా నికి 2500 మొక్కల చొప్పున నాటాలని, పర్యావరణాన్ని కాపాడటంలో ముందుండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గన్యాగుల పీఏసీఎస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, నగరపంచాయతీ కౌన్సిలర్‌ సత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, రమణ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement