‘ఎస్‌ఆర్‌కేఆర్‌’కు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ | start incubation centre in srkr | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఆర్‌కేఆర్‌’కు ఇంక్యుబేషన్‌ సెంటర్‌

Aug 16 2016 11:40 PM | Updated on Sep 4 2017 9:31 AM

ఇంజినీరింగ్‌ విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో కళాశాలలోనే నూతన ఉత్పత్తులు తయారుచేసేందుకు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.పార్థసారథివర్మ చెప్పారు.

భీమవరం : ఇంజినీరింగ్‌ విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో కళాశాలలోనే నూతన ఉత్పత్తులు తయారుచేసేందుకు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.పార్థసారథివర్మ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ వల్ల విద్యార్థులు కొత్త ఉత్పత్తిని తయారు చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపితే అవసరమైన నిధులు మంజూరవుతాయని చెప్పారు. విశాఖలో మొదటి ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేయగా తమ కళాశాలలో కేంద్రం రెండోవదని చెప్పారు. కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు, ౖచెర్మన్‌ గోకరాజు మురళీరంగరాజు, పి.కృష్ణం రాజు, సాగి విఠల్‌రంగరాజు, సాగి రామకృష్ణ నిశాంత్‌వర్మ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement