కమనీయం..శ్రీవారి కల్యాణం | srivari kalyanam | Sakshi
Sakshi News home page

కమనీయం..శ్రీవారి కల్యాణం

Jan 22 2017 11:23 PM | Updated on Jun 1 2018 8:31 PM

కమనీయం..శ్రీవారి కల్యాణం - Sakshi

కమనీయం..శ్రీవారి కల్యాణం

విష్ణు సహస్రనామ సత్సంగ మండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది.

అనంతపురం కల్చరల్‌ : విష్ణు సహస్రనామ సత్సంగ మండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు స్థానిక ఆర్‌ఎఫ్‌రోడ్డులోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్ణు సహస్రనామ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అనంతరం ప్రధాన అర్చకులు ఏఎల్‌ఎన్‌ శాస్త్రి, హరికిషోర్‌ శర్మ నేతృత్వంలో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో కల్యాణోత్సవం జరిగింది. అంతకు ముందు ఆలయంలోలక్ష్మీ వేంకటేశ్వరుడికి సుప్రభాత సేవలు, అభిషేక, అలంకార సేవలు పెద్ద ఎత్తున జరిగాయి. కార్యక్రమంలో పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement