శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 874.10 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం డ్యాం నీటి మట్టం 874.10 అడుగులు
Aug 19 2016 12:46 AM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 874.10 అడుగులకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 2.7 టీఎంసీల నీరు విడుదల కావడంతో నీటిమట్టం 6 పాయింట్లకు పడిపోయింది. 162.0554 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రానికి 159.3828 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సుమారు 40వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. రెండు పవర్‌హౌస్‌లలో డిమాండ్‌ను బట్టి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. సగటున విద్యుదుత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 25వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14,200 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Advertisement


