వైభవం.. శ్రీనివాసుని కల్యాణం | Srinivasa Kalyanam glory .. | Sakshi
Sakshi News home page

వైభవం.. శ్రీనివాసుని కల్యాణం

Dec 24 2016 11:36 PM | Updated on Sep 4 2017 11:31 PM

వైభవం.. శ్రీనివాసుని కల్యాణం

వైభవం.. శ్రీనివాసుని కల్యాణం

శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాలికోన్నత పాఠశాల మైదానంలో కల్యాణోత్సవం నిర్వహించారు.

రాయచోటి : శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా  సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాలికోన్నత పాఠశాల మైదానంలో కల్యాణోత్సవం నిర్వహించారు.   భక్తుల గోవిందనామస్మరణతో  ప్రాంగణం  మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. తిరుమల నుంచి తీసుకొచ్చిన శ్రీదేవి, భూదేవి సమేతుడైన  వెంకటేశ్వరస్వామి విగ్రహాలకు టీటీడీ వేద పండితులు  శాస్రోక్తంగా కల్యాణం నిర్వహించారు.  సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి,  శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్‌ దంపతులతో పాటు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. న్యాయమూర్తి తిరుమలరావు, తహసీల్దార్‌ గుణభూషణ్‌రెడ్డి, ప్రముఖ వైద్యులు బయారెడ్డి, సంగమ్మ,  మాజీ ఎన్‌జీఓ నేత వెంకటరెడ్డి, రాజు విద్యాసంస్ధల వ్యవస్ధాపకులు సుబ్బరాజు, విఆర్‌ విద్యా సంస్ధల డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి  పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement