సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ను టీడీపీ గూండాలు తగలబెట్టారు. వాహనాలకు కూడా టీడీపీ గూండాలు నిప్పటించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దాడి సమయంలో పార్టీ ఆఫీస్‌లోనే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నామినేషన్ సెంటర్ వద్ద కూడా టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. వాహనాలను ధ్వంసం చేసి తిరగబెట్టేశారు. నామినేషన్‌ను సెంటర్‌ను టీడీపీ గూండాలు చుట్టుముట్టేశారు. నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ గూండాల దాడిలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి.
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. కత్తులు, రాళ్లు, కర్రలతో మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో మిథున్‌రెడ్డి గాయపడ్డారు. మిథున్‌రెడ్డి గన్‌మెన్ తలకు తీవ్రగాయమైంది. వైఎస్సార్సీపీ నేతలు కూడా గాయపడ్డారు. నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టీడీపీ గూండాల దాడిలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చదవండి: మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక



