స్థానిక సంస్థల ఎన్నిలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటిరోజే టీడీపీ నేతలు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. దాడులపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు.. పుంగనూరు, రాయచోటి ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ? అంటూ ఆయన ప్రశ్నించారు.

Updates:
కడపలో టీడీపీ గూండాల బరితెగింపు
- వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చింపేసిన పచ్చమూకలు
- ఆర్వోకి ఇచ్చిన నామినేషన్ పత్రాలను లాక్కుని మరీ చించివేత
- బాలస్వామిరెడ్డిపై టీడీపీ గూండాల దాడి
- పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాల దాడులు
టీడీపీకి గెలిచే సత్తాలేదు: ఎంపీ మిథున్‌రెడ్డి
- బయట వ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు
- రాళ్లతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు
- వాహనాలను ధ్వంసం చేసి నానా హంగామా చేశారు
- రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు తీసుకోవడం లేదు
- పైనుంచి ఒత్తిడి ఉంది.. నామినేషన్ల తీసుకోబోమంటున్నారు
- అడ్డదారిలో గెలిచేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారు
- దమ్ముంటే ఎన్నికల్లో తలపడాలి
ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే: జూపూడి ప్రభాకర్‌రావు
- జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్య అభ్యర్థుల పరిస్థితి ఏంటి?
- ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది నామినేషన్లు వేయడానికా?
- ప్రతిపక్షాలపై దాడులు చేయడానికా?
- చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇంతటి అరాచకమా?
- ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం?
- ప్రజాబలం ఉన్నవాడు ఎన్నికల్లో పోరాడతాడు.. ఓటమి భయం ఉన్నవాడే దాడులకు దిగుతాడు
- స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు తెగబడుతోంది
- దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తారా?
- పోలీసులు ప్రజలకు రక్షకులా? అధికార పార్టీకి ప్రైవేటు సైన్యమా?
- టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చేతులు కట్టుకుని నిలబడటమేనా శాంతిభద్రతల పరిరక్షణ?
- పోలీసులు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి.. చంద్రబాబు ఆదేశాలకు కాదు
- చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులపై ఉన్న పట్టు.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎందుకు కనిపించడం లేదు?
- నామినేషన్ల తొలిరోజే దాడులతో స్వాగతం పలికారు..
- పోలింగ్ నాటికి ఇంకెన్ని అరాచకాలు చేస్తారు?
- అన్నమయ్య జిల్లాలో శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంపైనే దాడి చేసి తగలబెట్టే ప్రయత్నం చేయడం ఎంతటి దౌర్జన్యం?
- పార్టీ కార్యాలయంలో ఎన్నికలపై చర్చించుకోవడం కూడా నేరమేనా?
- వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కూటమి ఎన్నికల వ్యూహమా?
- ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులు గెలవాలి.. ప్రత్యర్థుల తలలు పగలగొట్టడం కాదు
- చంద్రబాబూ.. ఇదేనా మీ కార్యకర్తలకు నేర్పిన రాజకీయ సంస్కృతి?
- రాజకీయాల్లో సీనియారిటీ గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ముఖ్యం
- ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలి
- మా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలి
- పుంగనూరు దాడిపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలి
- దాడులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయాలి.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి
- స్థానిక పోలీసులపై మాకు నమ్మకం లేదు.. కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహించాలి
- ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తాం
- ఈ అరాచకాలను రాష్ట్రానికే పరిమితం చేయం.. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్తాం
- ఎన్నికల అక్రమాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేస్తాం
టీడీపీ గూండాల దాడులపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
- చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరులో విధ్వంసం
- నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు
- రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు తీసుకోవడం లేదు
- పోలీసులు టీడీపీ కార్యకర్తలతో కలిసి పోయారు
మళ్లీ ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత
ధర్మవరంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గుండాలు దాడి
రాళ్లతో వైఎస్సార్సీపీ నేతలపైకి దాడులు
- వైస్సార్సీపీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు
చిత్తూరు: ఎన్నికల అధికారుల ఏకపక్ష వైఖరి
- 10.45 గంటలకే నామినేషన్ కేంద్రానికి వెళ్లిన వై ఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు
- 3 గంటల పాటు తీసుకోవాలని కోరిన నామినేషన్ తీసుకొని ఎన్నికల అధికారులు
- జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందించని కలెక్టర్
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకా నాథరెడ్డి ఫోన్ చేసినా స్పందించని కలెక్టర్
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్ చేసినా స్పందించని కలెక్టర్
- టీడీపీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకొని అధికారులు
- కలెక్టర్ తీరుపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఎంపీ మిథున్‌రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్
- టీడీపీ గూండాల దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్
- ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్
- రెండున్నరేళ్ల పరిపాలనపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు
- అందుకనే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారు
- హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదు
- రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లా మార్చారు
- లోక్‌సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నా
- చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు
- పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారు
- దాడులు జరుగుతున్న పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోంది
- ఈ అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొంటాం
- న్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాం
- ధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటాం
- రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతాం
- పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయి
- ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతాం
- ప్రజలకు మంచి చేసిన చరిత్ర మాది
- హింసతో రాష్ట్రాన్ని నాశనంచేస్తున్న చరిత్ర చంద్రబాబుది
ఎన్నికల కమిషన్ ఆఫీస్:
- నామినేషన్ మొదటి రోజే ప్రజాస్వామ్యాన్ని తగలబెడుతున్నారు: లేళ్ల అప్పిరెడ్డి
- ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ గుండాలు, నాయకులు దాడి చేశారు
- టీడీపీ గుండాలు దాడి చేస్తారనే సమాచారం ముందుగానే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చాం
- రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు
- చంద్రబాబు సొంతం నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది
- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలవలేమని దాడులకు తెగబడ్డారు
- బయట దాడులు దాటుకొని లోపలకు వస్తే కనీసం అధికారులు నామినేషన్లు తీసుకోరు
- ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరిగితే టీడీపీ ఓడిపోతుంది
అప్రజాస్వామిక విధానాలపై ప్రజలు తీర్పు చెబుతారని ఎన్నికలను అడ్డుకుంటున్నారు - పారా మిలిటరీ దళాలను తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి
- నోడల్ ఆఫీసర్ రాజకుమారికి సమస్య వివరించాం
- ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ఎస్ఈసీ బాధ్యత వహించాలి
- ఎస్ఈసీ తన అధికారాలు బయటకు తీయాలి
- ఆన్లైన్లో నామినేషన్ తీసుకోవాలి.. మరో అధికారిని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం
పుంగనూరు మున్సిపాలిటీ నామినేషన్లు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు, కాన్వాయ్ లో ఉన్న 6 వాహనాలు ధ్వంసం
9 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న సమయంలో దాడి
నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వారిపై అకస్మాత్తుగా దాడి హత్యాయత్నం
పుంగనూరు ఎన్.ఎస్. పేట లోని బసవరాజా జూనియర్ కాలేజి లో మెయిన్ గేట్ వద్ద ఎంపీ మిథున్ రెడ్డి పై హత్యాయత్నం, వాహనాలు ధ్వంసం
కాలేజీ మెయిన్ గేట్ వద్ధ ఒక వాహనం ధ్వంసం , కాలేజీ లోపల ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలు పూర్తి గా ధ్వంసం
ముడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ పై దాడి చేసిన టీడీపీ అల్లరి మూకలు
ఎంపీ మిథున్ రెడ్డి ను టార్గెట్ చేస్తూ వాహనాలు విధ్వంసం
2 నామినేషన్లు స్వీకరణ, మిగిలిన నామినేషన్లు తీసుకోకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
నామినేషన్ ప్రాంగణం లోకి 400 మందికి పైగా చేరుకుని నిరసన
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు

రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
- రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ను తగలబెట్టిన టీడీపీ గూండాలు
- వాహనాలను కూడా టీడీపీ గూండాలు తగలబెట్టారు
- వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడులు
ధర్మవరంలో టీడీపీ కూటమి నేతల బరితెగింపు
- వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిలపై దాడి
- పుష్ప మణికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రి కి తరలింపు
- నామినేషన్లు లాక్కెళ్లిన టీడీపీ, బీజేపీ గూండాలు
- పోలీసుల సమక్షంలో ఘటన
మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్
- జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిపై దాడికి కూడా తెగబడుతున్నారు
- ప్రాణాలకు తెగించి అయినా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
- ఎంపీపై దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి


