పుష్కర ఏర్పాట్లు వేగవంతం చేయండి | speedup pushkara works | Sakshi
Sakshi News home page

పుష్కర ఏర్పాట్లు వేగవంతం చేయండి

Jul 28 2016 12:44 AM | Updated on Sep 4 2017 6:35 AM

కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రోడ్డు రవాణ సంస్థ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టరు జయరావు సూచించారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రోడ్డు రవాణ సంస్థ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టరు జయరావు సూచించారు. బుధవారం ఆయన విజయవాడ నుంచి స్థానిక అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండడంతో 5వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. భక్తుల కోసం తిప్పే బస్సుల కండిషన్‌ను మెరుగుపరచాలన్నారు. వీటి కోసం అవసరమైన సామాగ్రిని, వస్తువులను కడప జోనల్‌ కార్యాలయం నుంచి తెప్పించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎం వెంకటేశ్వర రావు, డీసీటీఎంలు శ్రీనివాసులు, మధుసూధన్, డీసీఎంఈ జీవన్, పర్సనల్‌ ఆఫీసర్‌ సర్దార్‌ హుసేన్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement