స్పీకర్‌ పరామర్శ | Speaker visitation | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ పరామర్శ

Sep 6 2016 9:39 PM | Updated on Jun 4 2019 5:16 PM

స్పీకర్‌ పరామర్శ - Sakshi

స్పీకర్‌ పరామర్శ

టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత వేముల సురేందర్‌రెడ్డి మృతి తీరని లోటు

వేల్పూర్‌:
టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత వేముల సురేందర్‌రెడ్డి మృతి తీరని లోటు అని స్పీకర్‌ మధుసుదనాచారి పేర్కొన్నారు. సురేందర్‌రెడ్డి గత నెల 27న మృతి చెందిన నేపథ్యంలో ఆయన తనయుడు, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డిని స్పీకర్‌ మంగళవారం వేల్పూర్‌లో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి సురేందర్‌రెడ్డి పార్టీలో ఉన్నారని, నైతిక విలువలు పక్కన పెడుతున్న ఈ రోజుల్లోనూ ఆయన టీఆర్‌ఎస్‌ కోసం అంకిత భావంతో పని చేశారని కొనియాడారు. రైతు నాయకుడిగా నిరంతరం రైతుల సంక్షేమం కోసం పరితపించేవారన్నారు. సురేందర్‌రెడ్డికి రావాల్సిన గౌరవం ఆయన తన యుడు ప్రశాంత్‌రెడ్డికి దక్కిందన్నారు. మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ పురాణం సతీష్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్‌ తదితరులు కూడా ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించారు. సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement