ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు | Sivacatussaptaha bhajans ends | Sakshi
Sakshi News home page

ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు

Nov 30 2016 10:23 PM | Updated on Sep 27 2018 5:46 PM

ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు - Sakshi

ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులో​‍్లఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి ఏర్పాటు చేసిన శివచతుస్సప్తాహ భజనలు బుధవారంతో ముగిశాయి.

శ్రీశైలం:  కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులో​‍్లఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి   ఏర్పాటు చేసిన  శివచతుస్సప్తాహ భజనలు బుధవారంతో  ముగిశాయి. గత నెల 31న కార్తీకమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని చారిత్రాత్మకమైన వీరశిరోమండపంలో ప్రారంభమైన ఈ శివ సప్తాహభజనలకు  అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తపూజలను నిర్వహించారు.  ఈ అఖండ శివభజనలలో  ''ఓం నమ శివాయ'' శివపంచాక్షరి భజన  24గంటల పాటు నిర్వహించారు.  గురునిమిషాంబా, చెన్నకేశవ,  శ్రీ రామాంజనేయస్వామి,  సుంకులమ్మ భజనమండళ్లు నెలరోజులపాటు  ఈ భజన సంకీర్తనామ పంచాక్షరిలో పాల్గొన్నట్లు ఈఓ నారాయణభరత్‌ గుప్త తెలిపారు.  శివచతుస్సప్తాహ భజనల ముగింపులో భాగంగా బుధవారం చండీశ్వరుడికి ప్రత్యేకపూజలను నిర్వహించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్‌ కడప అనిల్‌కుమార్, భక్తబృందం తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement