‘చలో కొత్తగూడెం’కు తరలిన కార్మికులు | singareni employees yatra | Sakshi
Sakshi News home page

‘చలో కొత్తగూడెం’కు తరలిన కార్మికులు

Jul 17 2016 11:15 PM | Updated on Sep 2 2018 4:16 PM

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియా ఏఐటీయూసీ నాయకులు ఆదివారం సింగరేణి రైలుకు తరలివెళ్లారు.

మందమర్రి : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న కొత్తగూడెంలో నిర్వహించ  తలపెట్టిన పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియా ఏఐటీయూసీ నాయకులు ఆదివారం సింగరేణి రైలుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తున్నామని అన్నారు. పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియాలోని 500 మంది కార్మికులు చలో కొత్తగూడెంకు తరలి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి తరలిన నేతల్లో సుదర్శన్, ఆర్‌ వెంకన్న, అంకతి సాయిలు తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement