విశాఖ జిల్లా చింతపల్లిలోని ఉద్యానపరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌రావు(50) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
విశాఖ జిల్లా చింతపల్లిలోని ఉద్యానపరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌రావు(50) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబసభ్యులు స్వగ్రామం వెళ్లగా ఆయన ఒక్కరే చింతపల్లిలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురువారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. చుట్టుపక్కల వారు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈయన నాలుగేళ్లుగా ఇక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.