ఎస్సీ, ఎస్టీ నిధులను మళ్లించిన కేసీఆర్‌ | SC, ST funds redirected KCR | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ నిధులను మళ్లించిన కేసీఆర్‌

Jan 5 2017 10:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఎస్సీ, ఎస్టీ నిధులను మిషన్‌ కాకతీయ, మిషన్‌

జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు శంకర్‌

జగిత్యాల రూరల్‌ :  రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఎస్సీ, ఎస్టీ నిధులను మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు మళ్లించి ఎస్సీ సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బండ శంకర్‌ అన్నారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచి సబ్‌ప్లాన్‌ చట్టం చేసి నిధులు కేటాయిస్తే మూడేళ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నక్క జీవన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement