శానిటరీ మేస్త్రీ ఆత్మహత్య | sanitary worker suviside | Sakshi
Sakshi News home page

శానిటరీ మేస్త్రీ ఆత్మహత్య

Aug 15 2016 11:05 PM | Updated on Sep 4 2017 9:24 AM

శానిటరీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేçÙన్‌ పరి«ధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్‌ వీఎంసీ కాలనీకి చెందిన వడ్డాది ఏడుకొండలు కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ మేస్త్రీగా ఉద్యోగం చేస్తుంటాడు.

విజయవాడ(చిట్టినగర్‌): 
శానిటరీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేçÙన్‌ పరి«ధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్‌ వీఎంసీ కాలనీకి చెందిన వడ్డాది ఏడుకొండలు కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ మేస్త్రీగా ఉద్యోగం చేస్తుంటాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం రూ.ఆరు లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతారనే ఆందోళనతో ఆదివారం సాయంత్రం పాముల కాల్వ సమీపంలో తన బైక్‌లోని పెట్రోల్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించిన ఏడుకొండలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement