ఇసుక లారీ సీజ్‌ | sand lorry seaz | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ సీజ్‌

Oct 26 2016 11:12 PM | Updated on Aug 28 2018 8:41 PM

కొడికొండ చెక్‌పోస్టులో బుధవారం తెల్లవారుజామున తాడిపత్రి ఏరియా నుంచి బెంగళూరుకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నట్లు హిందూపురం రూరల్‌ సీఐ రాజగోపాల్‌ నాయుడు, ఎస్‌ఐ జమాల్‌ బాషా తెలిపారు.

చిలమత్తూరు : కొడికొండ చెక్‌పోస్టులో బుధవారం తెల్లవారుజామున తాడిపత్రి ఏరియా నుంచి బెంగళూరుకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నట్లు హిందూపురం రూరల్‌ సీఐ రాజగోపాల్‌ నాయుడు, ఎస్‌ఐ జమాల్‌ బాషా తెలిపారు. లారీతో పాటు వెనుక వస్తున్న స్కార్పియో వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రైవర్లు శ్రీనివాసులు, రాజేష్, మల్లికార్జునరెడ్డి, మల్లికార్జున, ఆకుల జగదీశ్వర్‌పై కేసులు నమోదు చేశామన్నారు. కర్నూల్‌ జిల్లా యాగంటిపల్లి, బనగానిపల్లి, గడివేముల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement