కిడ్నీ బాధితుడికి చేయూత | sakshi effect | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితుడికి చేయూత

Jan 7 2017 11:52 PM | Updated on Aug 20 2018 8:20 PM

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల విద్యార్థులు అండగా నిలిచారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల విద్యార్థులు అండగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన మనోజ్‌కుమార్‌ అనే యువకుడు రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్న వైనంపై ‘సాక్షి’లో ఇటీవల ‘బతుకునివ్వండి’ శీర్షికతో కథనం వెలువడింది. స్పందించిన ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల బీజెడ్‌సీ ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.సుకన్య, ప్రణీతాదీప్తి, శిరీష, అనిల్‌కుమార్‌  రూ. 20 వేల విరాళం సేకరించారు. ఈ మొత్తాన్ని శనివారం కళాశాల కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన్‌ రెడ్డి చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement