సిఫి ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2016 అండర్–17 బాయ్స్ డబుల్స్ విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన కర్రి సాయి పవన్ బంగారు పతకం సాధించాడు. ఈ నెల 21–28 తేదీల మధ్య తిరుపతిలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న సాయి పవన్ అండర్–19 విభాగంలో సైతం పాల్గొని కాంస్య పతకం సాధించాడని అతడి తండ్రి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాడ్మింటన్‌లో సాయిపవన్‌కు స్వర్ణం
Aug 30 2016 9:54 PM | Updated on Sep 4 2017 11:35 AM
రాజమహేంద్రవరం సిటీ :
సిఫి ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2016 అండర్–17 బాయ్స్ డబుల్స్ విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన కర్రి సాయి పవన్ బంగారు పతకం సాధించాడు. ఈ నెల 21–28 తేదీల మధ్య తిరుపతిలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న సాయి పవన్ అండర్–19 విభాగంలో సైతం పాల్గొని కాంస్య పతకం సాధించాడని అతడి తండ్రి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17 విభాగంలో త్రివేండ్రం, హైదరాబాద్, తిరుపతిల్లో జరిగిన జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించాడన్నారు. సాయిపవన్‌ను వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అభినందించారు.
Advertisement
Advertisement