ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. ఐదుగురి మృతి | rtc bus, lorry accident in guntur district, four died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. ఐదుగురి మృతి

Nov 22 2015 3:54 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పిడుగురాళ్ల మండలం జాన్‌పాడ్ సమీపంలో  ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. 

కారంపూడి నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, పిడుగురాళ్ల వైపు పెళ్లి బృందంతో వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ పదేళ్ల చిన్నారితో పాటు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంతమందిని పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే పనిలో అధికారులు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement