రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం | Rs. one crore worth red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం

Sep 30 2015 9:33 AM | Updated on May 10 2018 12:34 PM

రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం - Sakshi

రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు జిల్లాలో పోలీసు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బుధవారం అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పోలీసు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బుధవారం అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లిమిట్ట మండలం ఎస్‌ఆర్‌పురం సమీపంలో కారులో తరలిస్తున్న రూ.40 వేల విలువైన 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అదేవిధంగా కార్వేటినగరం అటవీశాఖ కార్యాలయం వద్ద డీఎఫ్‌వో కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. వాహనంలో బొరుగుల లోడు అడుగు భాగంలో ఉంచి తరలిస్తున్న 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనానికి ఎస్కార్టుగా ఉన్న మరో కారును కూడా అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు.  స్వాధీనం చేసుకున్న మొత్తం ఎర్రచందనం దుంగల విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement