‘జావా డిస్కవర్’ పరువు పాయే.. ఆ డాక్యుమెంటరీ తొలగింపు | Java Discover Deletes Documentary On Red Sandalwood After Misrepresenting YS Jagan, Journalist Sudhakar Reddy Takes Legal Action | Sakshi
Sakshi News home page

‘జావా డిస్కవర్’ పరువు పాయే.. ఆ డాక్యుమెంటరీ తొలగింపు

May 7 2026 3:47 PM | Updated on May 7 2026 4:24 PM

Java Discover Channel Removes Documentary On Red Sandalwood

సాక్షి, తాడేపల్లి: తప్పుడు కథనం ప్రసారం చేసి పరువు పోగొట్టుకున్న జావా డిస్కవర్‌.. వెనక్కి తగ్గింది. ఆ ఛానల్‌.. ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించింది. డాక్యుమెంటరీలో జగన్ ఫోటోని ఆ ఛానల్‌ తప్పుగా చూపించగా.. దీనిపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్సార్‌సీపీ నోటీసులు పంపింది. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించారు. 

అయితే, జర్నలిస్ట్‌ సుధాకర్‌రెడ్డి రాయని అంశాన్ని జావా డిస్కవర్ ఛానల్ ప్రస్తావించింది. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుధాకర్‌రెడ్డి.. లీగల్ చర్యలకు దిగారు. తప్పు తెలుసుకున్న ఆ ఛానల్‌ డాక్యుమెంటరీని తొలగించింది. వైఎస్‌ జగన్ పై తప్పుడు ట్రోల్స్ చేసి టీడీపీ అభాసుపాలైంది.

ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్‌ జగన్‌ను ఇరికించేందుకు పచ్చ పార్టీ కుట్రలు పారలేదు. తప్పుడు కథనాలు చేసిన జావా డిస్కవర్ ఛానల్‌.. ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ డాక్యుమెంటరీని మార్చడంతో పాటు వక్రీకరించింది. 2021లో ‘బ్లడ్‌ శాండర్స్‌’ పేరుతో ఉడుముల సుధాకర్‌ రెడ్డి పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే తాను చెప్పని.. పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement