రూ.2 లక్షలు మాయం | Rs.2 lakhs strange trick | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షలు మాయం

Sep 3 2016 2:11 AM | Updated on Sep 4 2017 12:01 PM

భీమవరం టౌన్‌ : బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2లక్షలు మాయం కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

భీమవరం టౌన్‌ : బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2లక్షలు మాయం కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. పోలీసుల కథనం  ప్రకారం.. టూటౌన్‌కు చెందిన పి.రామరాజు గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.రెండులక్షలు విత్‌డ్రా చేసి ఆ మొత్తాన్ని సంచిలో పెట్టుకుని మోటార్‌సైకిల్‌కు తగిలించాడు. ఇంటికి వెళ్లి చూడగా, నగదు ఉన్న సంచి కనిపించ లేదు. దీంతో అతను అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టూటౌన్‌ సీఐ ఎం.రమేష్‌బాబు శుక్రవారం తెలిపారు. బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించగా, కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement