ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం | rpf constable missing | Sakshi
Sakshi News home page

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

Mar 7 2017 8:10 AM | Updated on Mar 19 2019 5:52 PM

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొప్పల బాలకొండయ్య అదృశ్యమయ్యారు

అనంతపురం: రైల్వేలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొప్పల బాలకొండయ్య అదృశ్యమయ్యారు. త్రీటౌన్‌ సీఐ వెంకటేసులు తెలిపిన వివరాల మేరకు... నార్పల మండల కేంద్రానికి చెందిన బాలకొండయ్య అనంతపురం రైల్వే పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. హెచ్చెల్సీ కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నారు.

గత నెల 22న విధులకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వచ్చిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బాధితుని భార్య లక్ష్మి త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement