రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతి | Road accident student dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతి

Jan 1 2017 11:24 PM | Updated on Nov 9 2018 4:36 PM

నూతన సంవత్సర వే డుకల సందర్భంగా అ మలాపురంలో శనివా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యా ర్థి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యా యి. రూరల్‌ మండలం ఈదరపల్లి శివారు ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాల పాలిటెక్నిక్‌

అమలాపురం టౌన్‌ :
నూతన సంవత్సర వే డుకల సందర్భంగా అ మలాపురంలో శనివా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యా ర్థి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యా యి. రూరల్‌ మండలం ఈదరపల్లి శివారు ఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాల పాలిటెక్నిక్‌ డిప్లమో రెండో సంవత్సరం విద్యార్థి రాయుడు శ్యామ్‌ లక్ష్మీ నరసింహ (18) ఈ ప్రమాదంలో     మృతి చెందాడు. పట్టణంలోని మెయి¯ŒS రోడ్డులో మసీదు వద్ద రెండు మోటారు సైకిళ్లు ఎదురు ఎదురుగా వస్తూ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్యామ్‌తో పాటు మరో మోటారు సైకిల్‌ నడుపుతున్న అంబాజీపేట మండలం తొండవరానికి చెందిన పేరాబత్తుల సూర్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. శ్యామ్‌ మోటారుసైకిల్‌పై వెనుక కూర్చున్న మరో యువకుడు రెడ్డి మణికృష్ణ కూడా గాయపడ్డాడు. గస్తీలో ఉన్న పోలీసు సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి శ్యామ్‌ పరిస్థితి విషమంగానే ఉంది. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడని సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement