డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ | Road accident kills one | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

Nov 3 2016 1:31 AM | Updated on Aug 30 2018 4:10 PM

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ - Sakshi

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఉలవపాడు/ కావలి రూరల్‌ : వేగంగా వెళ్తున్న బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

  • యువకుడి దుర్మరణం
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు  
  • ఉలవపాడు/ కావలి రూరల్‌ : వేగంగా వెళ్తున్న బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై మండలంలోని చాగల్లు పోలేరమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంవ బ్రహ్మారెడ్డిపాళెంకు చెందిన గుమ్మడి కుమార్‌ (25) చీరాలకు చెందిన టి.రాము, మనోజ్‌కుమార్‌తో కలిసి ఒకే బైక్‌పై నెల్లూరు నుంచి చీరాలకు బయల్దేరారు. నెల్లూరు జిల్లాలోని బ్రహ్మరెడ్డిపాళెంలో దశదిన కర్మకు వచ్చిన చీరాల వాసులు తమ మిత్రుడైన కుమార్‌ బైక్‌పై చీరాల తీసుకెళ్తున్నాడు. కుమార్‌ బైక్‌ నడుపతున్నాడు. చాగల్లు వద్దకు వచ్చే సరికి లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి కుడి వైపున డివైడర్‌ను ఢీకొట్టారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌ సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్‌ మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. ఒక్కడే కుమారుడు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
     
     

Advertisement
 
Advertisement
Advertisement