ఘాట్‌రోడ్డులో కారు బోల్తా.. | road accident in tirumala ghat road | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డులో కారు బోల్తా..

Nov 12 2016 9:35 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఘాట్‌రోడ్డులో కారు బోల్తా.. - Sakshi

ఘాట్‌రోడ్డులో కారు బోల్తా..

తిరుమల ఘాట్‌రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని బోల్తా కొట్టింది

తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. వారికి తీవ్ర గాయాలు కాలేదు. దీంతో ఘాట్‌రోడ్డులో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గురైన వారు చైన్నై నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement